ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీడ్స్ సంస్థ కార్యక్రమాలు అభినందనీయం... గౌతంరెడ్డి - రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

నెల్లూరుజిల్లా దుత్తలూరు సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమంలో... రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీడ్స్ సంస్థ సేవలను కొనియాడారు.

సీడ్స్ సంస్థ కార్యక్రమాలు అభినందనీయం... గౌతంరెడ్డి

By

Published : Aug 4, 2019, 6:09 PM IST

సీడ్స్ సంస్థ కార్యక్రమాలు అభినందనీయం... గౌతంరెడ్డి

సీడ్స్ వంటి సంస్థలు ప్రతి మండలంలో ఉంటే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా... సీడ్స్ సంస్థకు అందిస్తామని పేర్కొన్నారు. సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు, శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పాల్గొన్నారు. సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ తయారీ, కుట్టు శిక్షణ, కంటి వైద్య పరీక్షల విభాగాలను మంత్రి పరిశీలించారు. సీడ్స్ సంస్థ సేవలను కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details