వచ్చే నెల 1 నుంచి మూడో తేదీ వరకూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని దాలియన్‌లో జరగనున్న ప్రపంచ ఆర్ధిక సమాఖ్య వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గం నుంచి మంత్రి గౌతమ్ రెడ్డి తొలిసారి అధికారికంగా విదేశాల్లో పర్యటించనున్నారు. అధికారులు రజత్ భార్గవ్, ఈడీబీ సీఈవో జె.కృష్ణ కిషోర్ మంత్రితో చైనా వెళ్లనున్నారు.
చైనా పర్యటనకు మంత్రి గౌతమ్ రెడ్డి - mekapati gowtham reddy
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చైనా పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రివర్గం నుంచి గౌతమ్ రెడ్డి తొలిసారి అధికారికంగా విదేశాల్లో పర్యటించనున్నారు.
చైనా పర్యటనకు మంత్రి గౌతమ్ రెడ్డి