కరోనా వైరస్ ప్రభావంతో కష్టాల్లో అల్లాడుతున్న ఆక్వా రైతుల ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని నెల్లూరు జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు తెలిపారు. రొయ్యల సీడ్ గతంలో 40 పైసల నుంచి 60 పైసల వరకు అమ్మేవారని... ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు మేరకు రొయ్య పిల్ల 30 నుంచి 35 పైసల వరకు మాత్రమే అమ్మాలని మత్స్య శాఖ సంచాలకులు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎక్కువ ధరలకు రొయ్య పిల్లలు విక్రయించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం' - నెల్లూరు జిల్లా వార్తలు
కరోనా కారణంగా ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోయినందున వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. రొయ్య పిల్లలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆక్వాకు కరోనా దెబ్బ