నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పెద్దమసీదు ప్రాంతంలో నివాసం ఉన్న సాబ్జాన్, అతని కొడుకు సుభానిలపై... స్థలం వివాదంలో ఇస్మాయిల్, క్షమ్రూన్, వాళ్ళ ఇద్దరి కుమారులు కత్తిపీట, రోకలిబండతో దాడిచేశారని బాధితులు వాపోయారు. సబ్జాన్, సుభానిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మకూరు ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోడ విషయంలో గొడవ...రోకలిబండతో దాడి - attack ontwo parties in nelloore dt
స్థలంలో గోడ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. కత్తిపీట, రోకలిబండలతో దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
issue beteen two families 2 injured in nellore dst athamkoor