ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇస్రో జైత్రయాత్ర.... పీఎస్​ఎల్వీ-సీ 46 ప్రయోగం విజయవంతం

ఇస్రో తన విజయపరంపరను కొనసాగిస్తోంది. అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహం రీశాట్-2 బీఆర్1ను.. పీఎస్​ఎల్వీ-సీ 46ను వాహక నౌక విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

By

Published : May 22, 2019, 6:19 AM IST

Updated : May 22, 2019, 6:40 AM IST

నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్

దిగ్విజయం

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తిచేసి భారతదేశ ప్రతిష్టను మరోసారి ప్రపంచదేశాలకు చాటింది. ఉదయం 5.30 గంటలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగం విజయవంతమైంది. వాహక నౌకను శ్రీహరికోట నుంచి నింగిలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగం ఇది. 615 కిలోల బరువున్న రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహాన్నిరాకెట్ మోసుకెళ్లింది. 557 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని వాహక నౌక ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహం విడిపోయింది.

ముచ్చటగా మూడోసారి

రాడార్ ఇమేజింట్‌ శాటిలైట్లలో ఆర్‌.ఐ శాట్‌ 2బీ మూడవది మొదటగా 2009లో ఆర్.ఐ శాట్‌ను ప్రయోగించారు. ఆతర్వాత 2012లో ఆర్‌.ఐ.శాట్‌ 1 ప్రయోగం చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన.... ఆర్‌.ఐ శాట్‌ 2బీ ఐదేళ్లపాటు సేవలు అందించనుంది. వ్యవసాయంలో మార్పులు,అడవుల సంరక్షణ, వాతావరణంలో మార్పులతోపాటు తుపానుల వంటి విపత్తులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆర్‌.ఐ.శాట్‌ 2బీ అందించనుంది. కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటి నుంచే ఈ ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించనుంది.

Last Updated : May 22, 2019, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details