లాక్ డౌన్ నేపథ్యంలో.. పేదలకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేయడాన్ని అదునుగా భావించిన పంపిణీ దారులు.. అవినీతిబాట పట్టారు. అడ్డంగా దొరికిపోయారు. నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయితీ పరిధిలోని వావిళ్ళదొరువు గ్రామంలో వాలంటీర్ల ద్వారా చేపట్టిన బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగినట్లు గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందగా.. అక్కడి తహసీల్దారు తూకాలు పరిశీలించారు. నష్టపోయిన మొత్తాన్ని సవరించి పేదలకు మళ్లీ అందించారు. పంపిణీ బియ్యంలో 25కేజీలకుగానూ.. 2 కేజీల వంతున దోచేస్తున్నట్టు గుర్తించారు. కోట మండలం వావిళ్ళదొరువులో బట్టబయలయిన ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. విచారణ చేపట్టారు.
ఉచిత బియ్యం పంపిణీలో చేతి వాటం - Irregularities in the distribution of free ration rice at nellore
ఉచిత బియ్యం పంపిణీలోనూ కొందరు అధికారులు, డీలర్లు చేతివాటాన్ని ప్రదర్శించారు. కొలతల్లో మాయ చేసి.. పేదలను అన్యాయం చేయాలనుకున్నారు. చివరికి దొరికిపోయారు.
Irregularities in the distribution of free ration rice at Kottapatnam in nellore