ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్​ పరీక్షా పత్రాల మూల్యాంకనం షురూ - inter exams latest news update

ఇంటర్​ పరీక్షల జవాబు పత్రాలు దిద్దే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. కేఏసీ కళాశాల రెడ్​జోన్​లో ఉండటంతో... ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజీ తోపాటు కావలి, గూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో మూల్యాంకనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Inter exam papers correction
ఇంటర్​ పరీక్షా పత్రాలు దిద్దుబాటు షురూ

By

Published : May 17, 2020, 10:24 PM IST


నెల్లూరు జిల్లాలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. మార్చి నెలలోనే ప్రారంభమైనా... కరోనా కారణంగా వాయిదా పడింది. నగరంలోని కేఏసి కళాశాలలో జరగాల్సిన ఈ మూల్యాంకనం... అది రెడ్ జోన్ కావడంతో అధికారులు మార్పుచేశారు. ప్రస్తుతం నగరంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజీ తోపాటు కావలి, గూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో మూల్యాంకనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 600 మంది సిబ్బందిని నియమించారు. మూడు విడతల్లో జవాబు పత్రాలు దిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అధికారులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details