నెల్లూరు జిల్లా కావలి మండలంలోని తుమ్మలపెంట గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు వారణాసి దుర్గాప్రసాద్. విద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటుతూ పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. 61వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. 2019కి గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసి, గుంటూరు వైఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు సన్మానించారు. ఇదే విద్యాలయంలో చదివిన విద్యార్ధుల సహకారంతో గురుకుల శాట్ అనే పూర్తి స్థాయి ఉపగ్రహాన్ని తయారు చేసి ఇస్రో ద్వారా రోదసిలోకి పంపడమే తన కోరికంటున్నారు దుర్గాప్రసాద్.
ప్రజలు, విద్యార్థులకు ఆదర్శం వారణాసి - inspirational teacher varanasi durga prasadh in girls gurukula schools
ఒకవైపు పచ్చదనం పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరుస్తూ... మరోవైపు ఉపాధ్యాయుడిగా విద్యార్ధులకు ఖగోళ శాస్త్రం, గ్రహణాలు, టెలిస్కోప్ ద్వారా నక్షత్రాల గురించి బోధిస్తూ... రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు సొంతం చేసుకుంటున్నారు నెల్లూరు జిల్లా గురుకుల బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన వారణాసి.
ఆదర్శ ఉపాధ్యాయుడు వారణాసి