శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని దుకాణాల్లో సచివాలయాల ఉద్యోగులు తనిఖీలు చేశారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న పలు దుకాణాలకు జరిమానాలు విధించారు. ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల కలిగే అనర్దాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ సంచులు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పురపాలక సంఘం పరిధిలో 13 సచివాలయాల ఉద్యోగులు తిరుగుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా మాస్కులు కట్టుకోవాలని ప్రజలకు సూచించారు.
దుకాణాల్లో సచివాలయ ఉద్యోగుల తనిఖీలు.. ప్లాస్టిక్ కవర్ల వాడకంపై అవగాహన - Awareness on the use of plastic covers
ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న పలు దుకాణాల యజమానులకు నాయుడుపేట సచివాలయాల ఉద్యోగులు జరిమానాలు విధించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనార్ధాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు.
దుకాణాల్లో సచివాలయ ఉద్యోగుల తనిఖీలు