కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ నెల్లూరులో మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని పద్మావతి సెంటర్ వద్ద ఉన్న మద్యం దుకాణం ఎదుట పువ్వులు ఇస్తూ ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దశలవారీగా మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడు విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడం దారుణమని తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు రేవతి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్యం అమ్మకాలను ఆపేయాలని కోరారు.
మద్యం విక్రయాలు ఆపాలంటూ మహిళల వినూత్న నిరసన - నెల్లూరులో నిరసన
నెల్లూరులో మహిళలు వినూత్నంగా నిరసన చేపట్టారు. మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ.. మద్యం దుకాణాల ఎదుట బైఠాయించి, మద్యం కొనుగోలుకు వచ్చే వారికి పువ్వులు ఇస్తూ... తమ నిరసనను తెలియజేశారు.
మద్యం విక్రయాలు ఆపాలంటూ మహిళల వినూత్న నిరసన