నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని జెమిని ఎడిబుల్స్ అండ్ ప్యాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది. దాదాపు ఏడున్నర లక్షల రూపాయల విలువ చేసే 122 ఆక్సిజన్ సిలిండర్లను ఆ సంస్థ కమర్షియల్ మేనేజర్ పంపావతి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో జెమిని ఎడిబుల్స్ అండ్ ప్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో మిగిలిన పరిశ్రమల వారు ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
కరోనా నియంత్రణకు పరిశ్రమల చేయూత - నెల్లూరు వార్తలు
కరోనా నియంత్రణకు పరిశ్రమల యాజమాన్యం తమ వంతు చేయూతనందిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో జెమిని ఎడిబుల్స్ ఆండ్ ప్యాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది.
కరోనా నియంత్రణకు పరిశ్రమల చేయూత
జిజిహెచ్లో ఆక్సిజన్ కొరత లేకుండా 20వేల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల్లూరు నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆదివారం నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి