ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ప్రాంతాల్లో.. పరిశ్రమల కార్యకలాపాలకు అనుమతులు! - నెల్లూరు జిల్లా

కంటైన్మెంట్ జోన్లకు 7 కిలోమీటర్ల అవతల ఉండే పరిశ్రమలన్నింటికి అనుమతులు ఇస్తున్నట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు.

nellore  district
కంటోన్మెంట్ జోన్లో పరిశ్రమలకు అనుమాతులు

By

Published : May 2, 2020, 5:29 PM IST

నెల్లూరు జిల్లాలో కంటైన్మెంట్ జోన్లకు 7 కిలోమీటర్ల అవతల ఉండే పరిశ్రమలన్నింటికీ.. కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులిస్తున్నట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. పరిశ్రమల్లో కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రతి పరిశ్రమలో తాత్కాలిక క్వారంటైన్ గదిని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక చేయూతనివ్వడం అభినందనీయమని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details