కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో రాబోయే అవసరాలను తెలుసుకొని.. వైరస్‌ను ఎదుర్కోవాలని అధికారులను మంత్రి గౌతంరెడ్డి ఆదేశించారు. ఆత్మకూరు ఆర్డీవో, నియోజకవర్గస్థాయి అధికారులతో మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైన వెంటిలేటర్లను విశాఖలోని మెడ్‌టెక్ జోన్ నుంచి తెప్పించే బాధ్యతను ఓఎస్డీ అనిల్‌కు అప్పగించారు. హైదరాబాద్ డీఆర్డీవో, విశాఖ నుంచి ఆక్సిజన్ సిలిండర్ల తయారు చేయించి, వాటిలో ఆక్సిజన్ నింపి 200 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను ఆత్మకూరుకు తెప్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం పలువురితో సంప్రదించినట్టు తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ప్రజలు గుంపులుగా చేరకుండా చూడాలని, కచ్చితంగా మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కరోనా కట్టడిలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
కొవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచాలి: గౌతంరెడ్డి
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే అవసరాలను తెలుసుకొని ముందుగానే తెలియజేయాలని ఆదేశించారు. కరోనా చికిత్సకు కావాల్సిన మందులు, ఇతర సామగ్రి సమకూరుస్తామని చెప్పారు. కరోనా కట్టడి కోసం వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
గౌతంరెడ్డి