నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తవెల్లంటి గ్రామంలో ఎన్టీఆర్ నూతన విగ్రహాన్ని(NTR STATUE) నెల్లూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్తో కలిసి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించారు(ntr statue inaugurated at kotha vellanti). పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్న ఈ నేపథ్యంలో ధైర్యంగా ముందుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు(inauguration of the ntr statue in Nellore district) చేసిన ప్రతీ ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను' అని సోమిరెడ్డి అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, రేషన్ కార్డు వ్యవస్థ ద్వారా పేదలకు రూపాయికే కేజీ బియ్యం అందించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని సోమిరెడ్డి కొనియాడారు.
కండలేరు, సోమశిల జలాశయాలను తెలుగుగంగకు అనుసంధానం చేసి, జిల్లా ప్రజలకు వరంగా అందించారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాతో జలాశయాల్లో నీరున్నా.. పంటలు వేసుకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలేక రైతులు పంటలు పండించడానికి ముందుకురావడం లేదని.. భావితరాల భవిష్యత్ కోసం రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.