సోమశిల హైలెవల్ కెనాల్ ప్రాజెక్టు పనులను మూడేళ్లలోపు పూర్తి చేస్తామని... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఆయన పర్యటించారు. నందవరంలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు.
'మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తి' - మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వార్తలు
నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో అవినీతి తప్ప... రాష్ట్రాభివృద్ధికి జరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి
గ్రామ సచివాలయాల ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని మంత్రి చెప్పారు. అధికారుల చుట్టూ తిరగకుండా సచివాలయంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. తెదేపా ప్రభుత్వం అప్పులు మిగిల్చింది తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. సోమశిల హైలెవల్ కెనాల్ ద్వారా మెట్టప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దమ్ముంటే కేబినెట్ భేటీ అమరావతిలో పెట్టండి: దేవినేని ఉమ