నెల్లూరు జిల్లాలో తెల్ల దోమ విలయతాండవం చేస్తుంది. కొబ్బరి, అరటి పంటలకు తెల్ల దోమ సోకడంతో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. దిగుబడులు లభించక రైతులు నానాతంటాలు పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
కొబ్బరి, అరటి రైతులకు కంటతడి పెట్టిస్తున్న తెల్ల దోమ
తెల్ల దోమ విజృంభణతో నెల్లూరు జిల్లాలోని కొబ్బరి, అరటి రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. సరైన దిగుబడి రాక.. రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికైనా దోమల నివారణకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
రైతుల ఆవేదన..
జిల్లాలోని కొడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాల రైతులు కొబ్బరి, అరటి పంటలను విస్తారంగా సాగు చేస్తుంటారు. ఈ పంటలే జీవనాధారంగా బతుకు సాగిస్తున్న రైతులకు తెల్లదోమ కంటతడి పెట్టిస్తుంది. పంటలకు తెల్లదోమ సోకడంతో కనీసం పెట్టుబడులైనా వస్తాయా.. రావా..? అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు. దీనిపై స్పందించిన అధికారులు తెల్ల దోమ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.