నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట గ్రామానికి చెందిన కోక్కంటి శీమయ్య కు (45) ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. కుటుంబీకులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది సమ్మెలో ఉన్న కారణంగా... 108 వాహనం అందుబాటు లేదన్నారు. మరో అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఆ వాహనం తీరిగ్గా వచ్చేసరికే శీమయ్య ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
108 సమ్మెతో ఆగిన గుండె... పోయిన ప్రాణం - నెల్లూరు జిల్లా
సమ్మెతో సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నారు. కానీ.. ఓ నిండు ప్రాణం అదే సమ్మె కారణంగా.. ఆగిపోయింది. నెల్లూరు జిల్లాలో 108 అంబులెన్స్ సిబ్బంది సమ్మె కారణంగా.. ఈ ఘటన జరిగింది.
మృతి చెందిన శీమయ్య