One stabbed in Nellore: ఇరు వర్గాల వాగ్వాదం ఒకరిపై కత్తిపోట్లకు దారి తీసింది. నెల్లూరులో మంగళవారం జరిగిన ఈ ఘటనతో స్థానిక బారాషహీద్ ప్రాంతం ఉలిక్కిపడింది. నెల్లూరు బారాషాహిద్ దర్గా వద్ద ముస్లిం నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం ఘర్షణ చోటుచేసుకుంది. ఒక్కరికి కత్తిపోట్లు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరుడు సమీర్ కాగా, రాజకీయ అంశాలకు సంబంధించి రెండు వర్గాల మధ్య వాగ్వాదం అందుకు కారణమని తెలిసింది. ఘర్షణ నేపథ్యంలో బారాషాహీద్ దర్గా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నివారించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అస్పత్రిలో పరామర్శించిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ...రాజకీయ అంశాలపై చెలరేగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారితీసింది. వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నేత సమీర్ ఖాన్ కత్తిపోట్లకు గురవడంతో.. ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రయివేటు హాస్పిటల్ కు తరలించారు. దీంతో బారాషాహీద్ దర్గా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల కోటమిట్టకు చెందిన ముస్లిం మైనార్టీ నేత షమికి, సమీర్ ఖాన్ కు మధ్య చోటుచేసుకున్న రాజకీయ వివాదమే ఈ ఘటనకు దారితీసింది. కత్తిపోట్ల గురైన సమీర్ ఖాన్ ను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పరోక్షంగా షమీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనిల్... పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.