నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న 10 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న, అనుమతులు ఉండి ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్ చేసి కోర్టుకు పంపిస్తున్నామని గూడూరు డీఎస్పీ డీఎస్పీ భవాని హర్ష తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా తవ్వుతున్నా, తరలిస్తున్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నెల రోజుల వ్యవధిలో 39లారీలను సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచామనీ.. 49మందిని అరెస్ట్ చేసి కేసు పైల్ చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 5లక్షల రూపాయల పెనాల్టీ వేశామన్నారు. గూడూరు ఆర్టివో వారు 5వాహనాలకు 49వేల 235రూపాయిలు జరిమానా వేశారని తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల వేట - seaz 10 illegal sand vehicles
ఇసుక అక్రమ రవాణను పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు.
మీడియా సమేవేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ