నెల్లూరు జిల్లా బాలయపల్లి మండల పరిషత్ కార్యాలయంలో.. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఉద్యోగి వెంకయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనను అకారణంగా.. ఉన్నట్టుండి విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడే పురుగుల మందు తాగాడు. వెంటనే.. అతడిని గూడురూ ఆసుపత్రికి తరలించారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల వల్లే తనను విధుల నుంచి కావాలని బహిష్కరించారని వెంకయ్య లేఖ రాశాడు.
విధుల నుంచి తొలగించారని ఆత్మహత్యాయత్నం - sucide attempt
తనను విధులనుంచి తొలగించారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో చోటుచోసుకుంది.
విధుల నుంచి తొలగించారని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఉద్యోగి