ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోనగర్​లో రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం - Commencement of development works in Autonagar

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్​లో దాదాపు రూ. 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

In Autonagar, Rs. 8 crore for development works
నెల్లూరు: ఆటోనగర్ లో రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

By

Published : Feb 5, 2021, 5:54 PM IST

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్​లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 8 కోట్ల వ్యయంతో రోడ్లు, కాలువలు, కల్వర్టు పనులకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆటోనగర్ అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.

ప్రస్తుతం రూ. 8 కోట్లతో పనులు ఆటోనగర్ సగం భాగానికే సరిపోతుందన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరో రూ. 12 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఈ నిధులను వీలైనంత త్వరగా తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆటోనగర్ సమస్యల గురించి చెప్పిన వెంటనే పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారని కొనియాడారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను కలిసిన ఎస్‌ఈబీ చీఫ్

ABOUT THE AUTHOR

...view details