నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో రూపొందించిన సీఎం జగన్ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ శిల్పాన్ని రూపొందించారు.
జగన్ అనే నేను ట్యాగ్‌లైన్‌ను శిల్పానికి పెట్టారు. "ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ.. పేదలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న జగన్ పాలనకు గుర్తుగా ఈ సైకత శిల్పం రూపొందించా" అని శిల్పి మంచాల సనత్ కుమార్ తెలిపారు.