కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోపాటు కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కూరగాయల మార్కెట్ల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిత్యావసరాలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
'లాక్‌డౌన్‌ను పడక్బందీగా అమలు చేయండి' - నెల్లూరు జిల్లా లాక్డౌన్ వార్తలు
కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ను పడక్బందీగా అమలు చేయాలని నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.
'implement lock down strictly' ministers orderd nellore officials