ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాండౌస్ తుఫాన్ ప్రభావం.. నెల్లూరు జిల్లా అతలాకుతలం

Mandous cyclone effect On Nellore: మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. వరి, పత్తి, అపరాల సాగు రైతులు అతలాకుతలమయ్యారు. వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అలాగే సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పెన్నా బ్యారేజ్ నుంచి నీరు వదిలారు. అనంతరం నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు.

Rains in nellore
నెల్లూరు జిల్లాలో వర్షాలు

By

Published : Dec 11, 2022, 5:08 PM IST

Updated : Dec 11, 2022, 5:23 PM IST

Mandous cyclone effect On Nellore: మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నగరంలోని తల్పగిరికాలనీ, శ్రామిక నగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు నివాసాల్లోకి నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు.

జిల్లాలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి, పత్తి, అపరాల సాగు రైతులు అతలాకుతలమయ్యారు. జిల్లాలోని 16 మండలాల్లోని 118 గ్రామాలలో పంటల దెబ్బతిన్నాయి. వరి నారుమడలు 1300 ఎకరాలలో, వరి నాట్లు 16,127 ఎకరాలలో, పత్తి 1467 ఎకరాలలో, మినుము 360 ఎకరాలలో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇంకా వర్షం పడుతుండడంతో ఇంకా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు పెన్నా నదికి 30 వేల క్యూసెక్కులు నీరు వదిలారు. పెన్నా బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

మర్రిపాడు మండలంలో నందవరం చెరువు కాల్వకు గండి పడింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీ యంత్రాలతో గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో మాండౌస్ తుఫాన్ ప్రభావం

ఇవీ చదవండి:

Last Updated : Dec 11, 2022, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details