ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కువైట్​లో బతకలేకపోతున్నాం.. దయచేసి మమ్మల్ని ఇంటికి చేర్చండి'

కూలీ కోసం వలస వెళ్లిన తమ బతుకులను.. కంటికి కానరాని కరోనా అనే ఒక చిన్న జీవి అతలాకుతలం చేస్తోందని రాష్ట్రానికి చెందిన వాళ్లు ఆవేదన చెందుతున్నారు. కువైట్​లో చిక్కుకున్న తమను.. ప్రభుత్వమే స్వదేశానికి చేర్చాలని వారు వేడుకుంటున్నారు.

ap immigrants
'కువైట్ లో ఉండిపోయాం.. మమ్మల్ని ఇంటికి తీసుకపోండి'

By

Published : Jun 18, 2020, 10:21 AM IST

రోజులు దాటాయి. కంటినిండా కునుకుపట్టి వారాలు గడుస్తున్నాయి. కడుపునిండా కూడు లేక ఆకలితో అలమటిస్తున్నామని వలస కార్మికలు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 50 మంది నెల్లూరు, చిత్తూరు కడప జిల్లాలకు చెందినవారు.. కువైట్ లో ఉండిపోయారు.

ఇంటి మెహం చూస్తామో లేదో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ సమస్యపై స్పందించి.. ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details