Illegally Cultivated Crops in Penna River Basin: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పెన్నా నది పరీవాహక ప్రాంతం ఆక్రమణలకు గురవుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఇక్కడ శెనగ పంట సాగు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నదీ తీర ప్రాంతంలో బోర్లు వేయడం నిషేధమని తెలిసినా.. ఇక్కడ దాదాపు 800 ఎకరాలు ఆక్రమించి సుమారు 30 బోర్లు వేసి సాగుచేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు లీజులకు కూడా ఇస్తున్నారు. పైప్ లైన్లు ఏర్పాటు చేసుకుని బిందు సేద్యం ద్వారా పంటకు నీరు అందిస్తున్నారు. ఈ విషయాన్ని పెళ్లేరు గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
"దాదాపు 600 ఏకరాల నదీ పరివాహక ప్రాంతాన్ని చేజెర్ల మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అంతా ఆ పొలాన్ని ఆక్రమించి.. ఆక్రమించిన పొలాన్ని నెలకు 20000 రూపాయల లెక్కన ఒక ఎకరాకు లీజుకిస్తున్నారు.. 600 ఎకరాలను కూడా లీజుకిచ్చి సుమారు 1 కోటి 20 లక్షలు కుంభకోణం జరుగుతుంది.. ఈ కుంభకోణంలో సదరు అధికారులు భాగస్వాములుగా ఉన్నారు.. ప్రభుత్వ అధికారులు ఆ భూమికి తగిన సదుపాయాలు చేస్తున్నారు.. బోర్లు ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు .. బోర్లు కావలసిన విద్యుత్ కనెక్షన్లను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సహకరించారు." నందా ఓబులేసు అడ్వకేట్