నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను స్థానిక పోలీసులు పట్టుకున్నారు సంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. ప్రజల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని తన ఆటోలో వేసుకుని తరలిస్తుండగా... స్థానికుల సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - nellore district crime news
ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. పేదల కడుపు నింపాల్సిన బియ్యం... అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత