ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

150 కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం... పోలీసుల అదుపులో నిందితుడు - thurpu kambhampadu latest news

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం

By

Published : May 4, 2021, 11:46 AM IST

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 150 కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హనీఫ్​ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details