ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కావలిలో అక్రమ లేఅవుట్లపై విచారణ జరిపించాలి' - Illegal layouts in kavali should be investigated

నెల్లూరు జిల్లా కావలిలో అక్రమ లేఅవుట్లపై విచారణ జరిపించాలని తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు.

nellore district
కావలిలో అక్రమ లేఅవుట్లపై విచారణ జరిపించాలి

By

Published : Aug 8, 2020, 8:13 PM IST

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన బినామీలతో అక్రమ లేఅవుట్లు వేయించారని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ఈ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు. ఈ లేఅవుట్లపై అఖిలపక్షం ఆధ్వర్యంలో విచారణకు ఎమ్మెల్యే సిద్ధమా అని సవాల్ విసిరారు. అక్రమ లేఅవుట్లలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుంటే తాను బహిరంగ క్షమాపణ చెబుతానని, ఉంటే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడాన్ని ప్రశ్నిస్తే, తనపై ఎమ్మెల్యే అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details