నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు వద్ద కారులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి నుంచి నెల్లూరుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.
కారులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు - నెల్లూరు జిల్లా వార్తలు
కారులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను నెల్లూరు జిల్లా మేనకూరులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరకు విలువ లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టివేత