ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద కుటుంబానికి ఐక్య ఫౌండేషన్​ చేయూత - ikya Foundation help poor family news

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామంలో వైద్యం వికటించి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్​ అండగా నిలిచింది. ఆర్ధిక సాయంతో పాటుగా నిత్యావసర సరకులు అందజేశారు.

ikya Foundation help for the Poor Family
పేద కుటుంబానికి ఐక్య పౌండేషన్​ చేయూత

By

Published : Jun 1, 2020, 2:47 PM IST

కొన్ని రోజుల క్రితం వైద్యం వికటించి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్​ చేయూతనిచ్చింది. నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం గ్రామంలో ఆడ శిశువుకు జన్మనిచ్చి, వైద్యం వికటించడం వల్ల వెంకటమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్​ తరుపున 30 వేల రూపాయలు ఆర్ధిక సాయంతోపాటుగా బియ్యం, దుస్తులు అందజేశారు. చిన్నారి కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క దాతకు ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ ఛైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఆత్మకూరు అడ్వకేట్ ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతి నాయుడు, సహృదయ ఫౌండేషన్ ప్రతినిధి పెంచల్ రెడ్డి, స్వరూప్, రియాజ్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details