నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నివేశన స్థలాల పంపిణీకి 11,345 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు సోమశిల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఉదయగిరి నియోజకవర్గ ప్రత్యేకాధికారి సువర్ణమ్మ తెలిపారు. ఉదయగిరి తహసీల్దార్ హరనాథ్తో కలిసి గృహ నిర్మాణ శాఖ, ఉపాధి హామీ, వీఆర్వోలు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీల వారీగా నివేశన స్థలాల అభివృద్ధి, లాటరీ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. నియోజకవర్గంలో గుర్తించిన 11,345 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలం కేటాయించేందుకు 224 లే అవుట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉదయగిరి మండలంలో 25 లేఅవుట్లకు 23 లేఅవుట్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన రెండు లేఅవుట్లలో అభివృద్ధి పనులను పూర్తి చేసి ఎలాంటి పెండింగ్ లేకుండా చేయాలని సూచించారు.
నివేశన స్థలాల పంపిణీకి 11,345 మంది గుర్తింపు - udayagiri news
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నివేశన స్థలాల పంపిణీకి 11,345 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
నివేశన స్థలాల పంపిణీ కి 11,345 మంది లబ్ధిదారుల గుర్తింపు