ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశాను' - ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోం శాఖకు లేఖ రాశాను

MLA Kotamreddy Sridhar Latest comments: ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాకు తెలిపారు. అపాయిమెంట్ దొరికితే దిల్లీకి నేరుగా వెళ్లి కేంద్ర హోం శాఖను కలిసి.. లేఖను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు బెదిరింపు కాల్స్ ఇప్పటికి వస్తూనే ఉన్నాయని.. కాల్స్ చేస్తున్న వాళ్లంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కోటంరెడ్డి తెలిపారు.

praja poratam
praja poratam

By

Published : Feb 8, 2023, 1:13 PM IST

Updated : Feb 8, 2023, 2:37 PM IST

MLA Kotamreddy Sridhar Latest comments: ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం శాఖకు తాను లేఖ రాశానని వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అపాయిమెంట్ దొరికితే నేరుగా వెళ్లి కేంద్ర హోం శాఖను కలిసి లేఖను ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు పేరొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి తాను నిరంతరం ప్రజల్లోకి వస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను ఆరోపిస్తే.. తనపైనే విమర్శలు చేస్తున్నారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన ఆరోపణలపై ఎదుటివారు సరైన పద్ధతిలో మాట్లాడాలి గానీ.. తనపై శాపనార్థాలు, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆగ్రహించారు.

తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు పనుల గురించి మాట్లాడితే తప్పా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు నిధులు ఆపేస్తే అభివృద్ది నిలిచిపోతుందని.. ప్రజలు ఇబ్బందిపడతారని అన్నారు. రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ధ్వంసమైన రహదారులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోటంరెడ్డి కోరారు. పొట్టెపాలెం బ్రిడ్జి రోడ్డు నిర్మాణం విషయంలో 2021 నుంచి తాను ముఖ్యమంత్రిని అడుగగా.. రూ.28 కోట్లు విడుదల చేస్తున్నామని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని కోటంరెడ్డి వెల్లడించారు.

అనంతరం గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.15 కోట్లు నిధులు మంజూరు చేశారు గానీ.. నిర్మాణం చేయలేదన్నారు. ఎన్టీఆర్ నెక్లస్ రోడ్డు ఘాట్ల పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని.. వెంటనే ఆ పనులను పూర్తి చేయాలని కోరారు. బారా షాహీద్ దర్గాకు సంబంధించి పూర్తిస్థాయి అభివృద్దికి రూ.15 కోట్ల జీవో ఇవ్వగా.. తానే దగ్గరుండి శంకుస్థాపన చేయించానన్నా రు. ఆగస్టులో జీవోను జారీ చేయగా.. ఉదయం 8 గంటలకు వెళ్లితే రాత్రి 10 గంటల వరకు కూర్చొపెట్టారని వాపోయారు. ఫైనాన్స్ క్లీయరెన్స్ ఇంకా రాలేదని అడిగితే తనపై కోపంతో రగిలిపోతున్నారని కోటంరెడ్డి వివరించారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోం శాఖకు లేఖ రాశాను

న్యాయవాదులతో మాట్లాడిన తరువాత వారు ఇచ్చిన సూచనల మేరకు కేంద్ర హోంశాఖకు రాతపూర్వక ఫిర్యాదును ఈరోజే అందించి.. భవిష్యత్తులో వ్యక్తిగతంగా కలుస్తాను. వారు అపాయిమెంట్ ఇస్తే సంబంధిత శాఖల అధికారులను, మంత్రులను కలిసి ఫిర్యాదును అందజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే.. నన్ను తిట్లతో, శాపనార్థాలతో దూషించటం కాదు. పారదర్శకంగా ఉండాలని మీరు అనుకుంటే మీరు కూడా కేంద్రానికి లేఖ రాయండి.- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే

ఒక్కొక్క సమస్యపై వివిధ దశల్లో పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సోదరులతో ధర్నా చేస్తామన్నారు. 25వ పొట్టెపాలెం రోడ్డు వంతెన కోసం, డెకాస్ రోడ్డు సమస్యలపై రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు నిరసన చేపడతామన్నారు. తనకు బెదిరింపు కాల్స్ ఇప్పటికి వస్తూనే ఉన్నాయన్నారు. కాల్స్ చేస్తున్న వాళ్లంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 8, 2023, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details