నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం సింగనపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ భర్త భార్యపై కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ, వెంకటరమణ భార్యాభర్తలు. తాగని మైకంలో వెంకటరమణ భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మద్యానికి డబ్బులు అడిగితే లేవని చెప్పినందునే తన కుమార్తెపై దాడి చేశాడని రామలక్ష్మమ్మ తల్లి తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో భార్యపై భర్త దాడి - husband attack on wife in nellore
మద్యం మత్తులో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం సింగనపల్లిలో జరిగింది. మద్యానికి డబ్బులు అడిగితే లేవన్నందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తల్లి తెలిపింది. నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతున్న బాధితురాలు