చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై నెల్లూరులో భారీ ర్యాలీ..హోరెత్తిన నినాదాలు Huge Rally in Nellore Against Chandrababu Illegal Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఆ పార్టీ ముఖ్య నేతలు, వందలామంది కార్యకర్తలు నెల్లూరు జిల్లాలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భాగంగా 'బాబు కోసం మేము సైతం' అంటూ పార్టీ అభిమానులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. సైకో పోవాలి-సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేతలు హెచ్చరించారు.
TDP Chief Chandrababu Illegally Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. రాష్ట్రవ్వాప్తంగా గతకొన్ని రోజులుగా నిరసనలు, ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 'బాబు కోసం మేము సైతం' అంటూ తాజాగా ఆ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళాలు కదం తొక్కుతున్నారు.చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటూ.. రిలే నిరాహారదీక్షలు, ర్యాలీలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
TDP activists stage protests in AP: చంద్రబాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసన జ్వాలలు...
Huge Rally in Nellore:ఈ నేపథ్యంలో మంగళవారం నెల్లూరు జిల్లాలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ.. వీఆర్‌సీ (V.R.C.) సెంటర్‌లో టీడీపీ శాంతియుత ర్యాలీ చేపట్టింది. దీంతో నగరంలోని రహదారులు జనసంద్రంగా మారాయి. గాంధీ విగ్రహం, అంబేడ్కర్ సెంటర్ వరకూ సాగిన ర్యాలీకి.. జనసేన, సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు. ర్యాలీలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామానారాయణరెడ్డి, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 'సైకో పోవాలి- సైకిల్' రావాలంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
Chandrababu Should be Released Immediately:అనంతరం అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని నేతలు ధ్వజమెత్తారు. పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే.. పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Transgenders Protest for CBN: వైసీపీ అక్రమాల నిలయంగా మారిందన్న ట్రాన్స్జెండర్లు.. చంద్రబాబుకు మద్దతు
Police Stopped MLA Kotam Reddy:మరోవైపు వీఆర్‌సీ కూడలి వద్ద టీడీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీలో పాల్గొనకుండా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోటంరెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని ఆటోలో వీఆర్‌సీ (V.R.C.)కి టీడీపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ శాంతియుత ర్యాలీకీ నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచీ వందలాది మంది పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌కి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో వీఆర్‌సీ సెంటర్ హోరెత్తిపోయింది.
''చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ.. వేలాది మంది ప్రజలు వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి, పోలీసులకు ఒక్కటే చెబుతున్నాం.. ఇప్పటికైనా తప్పుడు ఆలోచనలు, కేసులు పెట్టడం ఆపండి. పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా వ్యవహరించడం మానుకోండి. రాష్ట్రంలో పోలీసుల తీరు వల్ల ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. జగన్ ప్రభుత్వానికి గాంధీ మార్గమంటే ఇష్టముండదు. జగన్‌ది గాడ్సే ప్రభుత్వం. తాడోపేడో తేల్చుకుంటాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అంతుచూస్తాం. ఎవరినీ వదిలిపెట్టాం.''-నెల్లూరు టీడీపీ నేతలు
TDP Leaders Protest on Chandrababu Arrest: బాబు అరెస్టుపై ఆగని ఆందోళనలు.. విడుదల చేయాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు..