కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈ నెల 26న జరిగే దేశ వ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలని నెల్లూరులో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని జెట్టి శేషారెడ్డి భవన్ నుంచి వి.ఆర్.సి. క్రీడా మైదానం వరకు ర్యాలీ సాగింది. పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆటో కార్మికులపై అధిక జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని సీఐటీయూ నేత నాగేశ్వరరావు విమర్శించారు. ఆటో కార్మికులకు పార్కింగ్ స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా భారీ ఆటో ర్యాలీ
సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 26న జరిగే దేశ వ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ
ఇవీ చూడండి...