తమకు వేతనాలు ఇవ్వాలంటూ నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ నిరసన తెలియజేశారు. ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆసుపత్రి ఎదుట సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన - carona warriors worries
వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ, పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.
ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన
ప్రస్తుతం కరోనా విధులు నిర్వహిస్తున్నా, తమ సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ, పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.
ఇది చదవండిజీజీహెచ్లో నర్సుల ధర్నా