నెల్లూరు జిల్లాలో లక్షా 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయని ఉద్యాన శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సుభాని తెలిపారు. జిల్లాలో ప్రధానంగా నిమ్మ, మామిడి, కూరగాయలు, జామ తోట సాగు అవుతున్నాయని చెప్పారు. వీటి ద్వారా అన్నదాత మెరుగైన లాభాలు పొందుతున్నారని వివరించారు. రైతులను కొత్త పంటల వైపు తీసుకెళ్లేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోందని సుభాని అన్నారు.
ఇందులో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ హెక్టారుకు 3, 31, 000 రూపాయల రాయితీ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశం రెండు హెక్టార్ల వరకే ఉంటుందని చెప్పారు. సమీకృత ఉద్యాన ప్రోత్సాహక పథకం ద్వారా ఈ రాయితీ అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సుభాని కోరుతున్నారు.