నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కూరగాయల మార్కెట్ యార్డ్లో తేనెటీగల గుంపు.. అక్కడున్న వారిపై ఎగబడింది. తెల్లవారుజాము కూరగాయలు కొనేందుకు ఎక్కువ మంది మార్కెట్కు వస్తారు. అదే సమయంలో జరగిన ఈ ఘటనలో.. దాదాపు 50 మంది వరకు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పురపాలక శాఖ అధికారులు ట్రాక్టర్లతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచకారీ చేయించారు.
అయినప్పటికీ తేనెటీగల గుంపు అదుపు కాలేదు. సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేసే సిబ్బంది పైనా దాడి చేశాయి. వస్త్రాలకు మంటలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. అంతే కాక... న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ముగ్గురు మీడియా ప్రతినిధులను సైతం తేనెటీగలు కుట్టాయి. ఈ ఘటనలో గాయపడినవారిలో.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.