నెల్లూరు పట్టణంలోని కబడిపాలెంలో ఉన్న ఎస్సీ సామాజిక హాలులో గ్రామసచివాలయ కార్యాలయం నిర్వహించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎస్సీలు సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న హాలులో సచివాలయం ఏవిధంగా ఏర్పాటు చేస్తారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో కమ్యూనిటీ హాల్‌ను ఖాళీ చేసి, సచివాలయాన్ని మరోచోటుకు తరలించాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఎస్సీ కమ్యూనిటీ హాల్లో గ్రామసచివాలయం.. ఖాళీ చేయాలన్న హైకోర్టు - nellore news
నెల్లూరు పట్టణంలోని కబడిపాలెం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న గ్రామసచివాలయాన్ని తరలించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇందుకు నాలుగు వారాలు సమయాన్నిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎస్సీ కమ్యూనిటీ హాల్లో గ్రామసచివాలయం ఖాళీ చేయాలన్న హైకోర్టు