నెల్లూరు నగర పాలక సంస్థ వార్డుల పునర్విభజనకై మున్సిపల్ కమిషనర్ జారీచేసిన తుది నోటిఫికేషన్ అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాము తుది ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ... పూర్తి వివరాలను సమర్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
నెల్లూరు నగర పాలక సంస్థ వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే
నెల్లూరు నగర పాలక సంస్థ వార్డుల పునర్విభజనకై మున్సిపల్ కమిషనర్ జారీచేసిన తుది నోటిఫికేషన్ అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ... పూర్తి వివరాలను సమర్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది.
నెల్లూరు నగరపాలక సంస్థను 54 వార్డులుగా పునర్విభజన చేస్తూ గత నెలలో మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ వి.భువనేశ్వరి ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు నిబంధనలకు విరుద్ధంగా తుది నోటిఫికేషన్ జారీ చేశారని... జనరల్ బాడీ ఆమోదం కోసం ప్రాథమిక నోటిఫికేషన్ పంపలేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. పునర్విభజన గెజిట్ ప్రకటనను తెలుగు, ఉర్దూ, ఆంగ్ల పత్రికల్లో ప్రచురించలేదన్నారు. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది నిబంధనల మేరకు వ్యవహరించామని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు కోర్టును గడువు కోరారు.
ఇదీచూడండి.విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం
TAGGED:
నెల్లూరు నగర పాలక సంస్థ