కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థకు చెందిన భూముల విషయంలో వారంరోజుల పాటు యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లా కోట, చిల్లకూరు మండలాల పరిధిలోని తమకు చెందిన 4 వేల791 ఎకరాల భూమి కేటాయింపులను ఏపీఐఐసీ రద్దు చేస్తూ జారీచేసిన లేఖను రద్దు చేయాలని కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అధికారులు ఇచ్చిన నోటీసులకు కనీసం సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే ఏకపక్షంగా భూములు రద్దు చేశారని కోర్టుకు విన్నవించారు. రిజిస్టర్ దస్తావేజుల ద్వారానే ఏపీఐఐసీ ఆ భూములను తమకు విక్రయించిందన్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.
కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ భూముల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థకు చెందిన భూముల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వారంరోజుల పాటు యథాతథస్థితి కొనసాగించాలంటూ ఆదేశించింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు