నెల్లూరు జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కండలేరు జలశయం కళకళలాడుతోంది. ఓ వైపు నీరు, మరోమైపు ప్రకృతి సోయగాలతో జలాశయం... పర్యాటక ప్రదేశంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వర్షం కురుస్తున్నప్పటికి పర్యాటకులతో సందడి నెలకొంది. నెల్లూరు జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు కండలేరు జలాశయాన్ని సందర్శిస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, చెన్నై సాగు, తాగునీటి దాహార్తిని తీర్చుతున్న కండలేరు జలాశయం ఈ సారి పూర్తి స్థాయిలో నీళ్లు ఉండటంతో స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కళకళలాడుతున్న కండలేరు జలాశయం - nellore district latest news
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కండలేరు జలాశయం కళకళలాడుతోంది. పరిసరాలు పచ్చదనం సంతరించుకోగా.. అటవీప్రాంత పరిసరాలు ఆహ్లాదంగా మారాయి.
![కళకళలాడుతున్న కండలేరు జలాశయం కళకళలాడుతున్న కండలేరు జలాశయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9217324-408-9217324-1602984399129.jpg)
కళకళలాడుతున్న కండలేరు జలాశయం