ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HEAVY RAINS IN NELLORE AND KADAPA : నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షం...ఆందోళనలో ప్రజలు - నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

కడప, నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి కోలుకోక ముందే...మళ్లీ వర్షాలు పడటం కలవరపాటుకు గురిచేస్తోంది.

నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షం
నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షం

By

Published : Nov 28, 2021, 9:03 AM IST

Updated : Nov 28, 2021, 10:36 AM IST

నెల్లూరు జిల్లా(heavy rains in nellore district) ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, చెజర్ల, సంగం, ఏయస్ పేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తుండగా...ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆత్మకూరు అత్యధికంగా 10 సెం. మీ వర్షం నమోదు కాగా... సంగంలో 9 సెం.మీ గా నమోదైంది.

కడపలో తెల్లవారుజాము నుంచి వర్షం...
కడపలో తెల్లవారుజాము నుంచి వర్షం(heavy rains in kadapa) కురుస్తోంది. పది రోజుల కిందట కురిసిన భారీ వర్షం నుంచి నగరవాసులు కోలుకోక మునుపే...మళ్లీ వర్షాలు పడటం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండు కుండలా మారాయి. చెరువుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చదవండి:HEAVY RAINS IN NELLORE DISTRICT : ఎడతెరిపి లేని వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Last Updated : Nov 28, 2021, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details