ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAINS: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. గ్రామాలు జలదిగ్బంధం - నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

By

Published : Nov 18, 2021, 7:12 PM IST

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేకచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిర్చి, పొగాకు, మినప పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

వర్షాలు వచ్చిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి పెన్నానదికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

అనంతసాగరంలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పశువుల వైద్యశాలలో వర్షపు నీరు చేరింది. వర్షపు నీటికి స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లెేక పోవడంతో ప్రమాదం తప్పింది.

భారీ వర్షానికి గుడూరులోని పంబలేరు కాలువ పొంగిపొర్లుతోంది. వరదనీటిలో కాలువ దాటుతుండగా ఆదిశంకర ఇంజినీరింగ్ విద్యార్థులు జారి పడ్డారు. తృటిలో ప్రమాదం తప్పింది. ప్రవాహం వేగంగా ఉండటంతో విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లారు. వెంకటగిరిలొ భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గొడ్డేరు కాజ్​వేపై ప్రవాహం సాగుతుంది.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. మావోలతో సంబంధాలపై ఆరా

ABOUT THE AUTHOR

...view details