నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నెల్లూరు నగరం, బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లమీద వర్షపు నీరు ప్రవహించటంతో... వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
నెల్లూరులో భారీ వర్షాలు... రోడ్లన్నీ జలమయం - నెల్లూరులో భారీ వర్షాలు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నెల్లూరులో భారీ వర్షాలు... రోడ్లన్నీ జలమయం
జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, జలదంకి, కొండాపురం, కోవూరు ప్రాంతాల్లో చెరువులు నిండాయి. పాటూరు, ఉత్తరపల్లిపాలెం వద్ద మలిదేవి కాలువలో ప్రవాహం పెరిగింది. కాలువలో ఎక్కువగా పెరిగిన గుర్రపడెక్కను తొలగించేంచుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: