నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసరాల్లో భారీ వర్షం నేడు కూడా కొనసాగింది. వరి నారుమళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. విత్తనాలు చల్లి 14 రోజులు కాగా.. అవి మొలకెత్తక పోవడంతో రైతులు రెండో సారి చల్లుతున్నారు. అన్నదాతలు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది.
వర్షం కారణంగా నాయుడుపేట పురపాలక సంఘం ప్రధాన వీధుల్లో.. వరాహాలు విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ దుకాణాలు, ఇళ్లలోకి వెళ్తున్నాయి. వాహనాలకు అడ్డుపడుతూ ప్రయాణికులను ఇబ్బంది కలిగిస్తున్నాయి.