ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు నగరాన్ని వణికిస్తున్న బురేవి తుపాను - నెల్లూరు తాజా సమాచారం

నెల్లూరు జిల్లాను వర్షాలు వీడటం లేదు. బురేవి తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నివర్ తుపాను నుంచి ఇంకా ప్రజలు కోలుకోక ముందే మళ్లీ బురేవి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

burevi in nellore
నెల్లూరు నగరాన్ని వణికిస్తున్న బురేవి తుపాను

By

Published : Dec 5, 2020, 3:14 PM IST

బురేవి తుపాను ప్రభావంతో నెల్లూరు నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలైన గాంధీబొమ్మ, కె.వి.ఆర్ పెట్రోల్ బంక్, పద్మావతి సెంటర్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతోపాటు డి.కె.డబ్ల్యూ కళాశాల, శబరి క్షేత్రం, సండే మార్కెట్, సుబేదారుపేట ప్రాంతాల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లపై నీరు భారీగా చేరడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివర్ తుపాను నుంచి ఇంకా కోలుకోకముందే బురేవి తుపాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండీ... రూపుమారిన పేదల స్థలాలు...ఇరవై రోజుల్లో సిద్ధం చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details