నెల్లూరు జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నాయుడుపేట మండలం ద్వారకాపురంలో 3 రోజులుగా కురుస్తున్న వానలకు వేరుశనగ పంట పాడయింది. ఇక్కడ దాదాపు 300 ఎకరాల్లో వేరుశనగ సాగవుతోంది. పంట చేతికందే సమయంలో వర్షం కురవటంతో నీరు నిలిచి పంట దెబ్బతిందని రైతులు వాపోయారు. తాము తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
వర్షాలకు పొలాల్లో నిలిచిన నీరు.. వేరుశనగ పంటకు నష్టం - నాయుడుపేటలో వర్షాలకు పంట నష్టం వార్తలు
నెల్లూరు జిల్లా ద్వారకాపురంలో వర్షాలకు వేరుశనగ పంట దెబ్బతింది. 3 రోజులుగా కురుస్తున్న వానలకు పొలాల్లో నీరు నిలిచి పంట నాశనమైందని రైతులు వాపోయారు.
వేరశనగ పొలాల్లో నిలిచిన నీరు