ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ ప్రభావం...నెల్లూరులో భారీ వర్షం - నెల్లూరు తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నివర్ తుఫాను ప్రభావంతో...నెల్లూరు నగరం నీటమునిగింది. రహదారులన్నీ జలమయమయ్యాయి.

heavy-rain-in-nellore
నెల్లూరులో భారీ వర్షం

By

Published : Nov 25, 2020, 12:57 PM IST


నివర్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. కాలవలు, రహదారులపై వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. వర్షపు నీరు పోయేందుకు సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. శబరి క్షేత్రం వద్ద మోకాల్లోతు నీరు చేరింది. ఇక్కడే వున్న సోమశిల ఎస్.సి. కార్యాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. కార్యాలయం వెళ్లే మార్గమంతా నీటితో నిండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో ప్రధానమైన జి.ఎన్.టి. రోడ్డు చెరువును తలపిస్తోంది. అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది.

నెల్లూరులో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details